శంషాబాద్ ఎయిర్పోర్టులో షాకింగ్ ఘటన: విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శంషాబాద్
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో కడప వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా, క్యాబిన్ సిబ్బంది వెంటనే అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.