ఇందిరమ్మ కుట్టుమిషన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో బీసీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత కలిగిన మహిళలు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తక్షణమే అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కుట్టు మిషన్లు అందజేయనున్నారు.