రాజస్థాన్‌లో దారుణం: గిరిజన మహిళపై దాడి, ఏడుగురు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో గిరిజన మహిళపై అమానుష దాడి జరిగింది. భర్త గోపాల్ ఖాత్ తన బంధువులతో కలిసి భార్యను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి, బట్టలు చింపి, జుట్టు కత్తిరించి బహిరంగంగా అవమానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, భర్తతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.