ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో మహిళా పోలీసులతో కలిసి డాన్స్ చేసిన దానం నాగేందర్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మహానగరంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సాహంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. డీజేలో జోరుగా మోగుతున్న ఆయా షేర్ పాటకు ఆయన హుషారైన స్టెప్పులేశారు. అక్కడే విధుల్లో నిమగ్నమై ఉన్న మహిళా పోలీసు సిబ్బందిని సైతం ఉత్సాహపరుస్తూ వారితో కలిసి సరదాగా చిందేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.