భారత పైలట్ సాహసంతో తప్పిన భారీ విమాన ప్రమాదం

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో తోటి పైలట్ విమానాన్ని కూల్చేయడానికి యత్నించగా, భారతీయ కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్ర గాయాలపాలైనా ధైర్యంగా పోరాడి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించారని అధికారులు తెలిపారు. ఈ సాహస ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఆయనను నిజమైన హీరోగా కొనియాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.