విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలకుల నిర్లక్ష్యపు వైఖరి
రిపోర్టర్: bhukya Narasimha rao
స్థలం: జులూరుపాడు
జులూరుపాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యాసంస్థలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫామ్స్ అందజేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.