ముసాయిదా ఓటర్ల జాబితా అభ్యంతరాల స్వీకరణ గడువు ముగింపు

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు కోసం లక్షలాదిగా దరఖాస్తులు అందాయి. లోపాలున్న 44.28 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, అక్టోబర్ 5 నాటికి ఫిర్యాదుల పరిష్కారం పూర్తి చేసి, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.