నవంబర్ ఇరవై వరకు సాగునీరు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి
రిపోర్టర్: Shahid Syeds
స్థలం: లక్సెట్టిపేట
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో వేసిన పంటలను కాపాడేందుకు నవంబర్ ఇరవై వరకు సాగునీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కడెం ప్రాజెక్ట్ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. పంటలకు సాగునీరు అత్యవసరమని, తక్షణమే స్పందించి ఆదుకోవాలని ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు.