చిన్నారుల ఆరోగ్యానికి వెలుగులు నింపే పౌష్టికాహార చైతన్య వేడుకలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరు మండల పరిధిలోని ఉలవరపల్లి అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలను శుక్రవారం రోజున గ్రామీణ ప్రజల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్ వైజర్ పద్మజతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు చెన్నమ్మ, విమల పాల్గొని చిన్నారులు, గర్భిణులు మరియు బాలింతలకు పోషకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పోషకాల లోపం లేని ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.