జామియా మిలియా ఇస్లామియాలో ఆఫ్లైన్ తరగతులు ప్రారంభం: విద్యార్థుల నిరసన విరమణ

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో నవంబర్ పదవ తేదీ నుంచి ఆఫ్లైన్ తరగతులు ప్రారంభం కానున్నట్లు రిజిస్టర్ ప్రొఫెసర్ మహ్తాబ్ ఆలం రిజ్వి వెల్లడించారు. గత పద్దెనిమిది రోజులుగా విద్యార్థులు చేపట్టిన నిరసన సమ్మె విరమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థి సంఘం పునరుద్ధరణకు సంబంధించి వర్సిటీ యంత్రాంగం స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. నవంబర్ పదహారు నుంచి ఇరవై ఒకటి మధ్య రెండో మిడ్-టర్మ్ పరీక్షలు కూడా ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.