'స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్': షావోమి 18 ప్రో సిరీస్ లాంచ్ ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: చైనా
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తన సరికొత్త షావోమి 18 ప్రో సిరీస్‌ను ఈ నెలలో చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ వెనుక భాగంలో సరికొత్త 'వెర్సటైల్ బ్యాక్ స్క్రీన్' సెకండరీ డిస్‌ప్లేను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు చిన్నపాటి అప్లికేషన్లను నేరుగా రన్ చేసుకునే అద్భుతమైన ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.