సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. ఫేక్ కాల్స్, లాటరీలు, లోన్ యాప్స్, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.