ఢిల్లీలో మరో నిర్భయ ఘటన కదులుతున్న టెంపోలో బాలికపై అత్యాచారం

రిపోర్టర్: సురేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్వరూప్ నగర్ ప్రాంతంలో కదులుతున్న టెంపోలో 17 ఏళ్ల బాలికపై నలుగురు కిరాతకులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పొలాల్లో పడేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం. బాధితురాలికి వీరంతా పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.