టీచర్లకు గుడ్ న్యూస్: బ్రిడ్జ్ కోర్సు రిజిస్ట్రేషన్లకు ఎన్ఐఓఎస్ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 28 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. గతంలో బీఈడీ అర్హతతో నియమితులైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.