ఆహార భద్రతలో వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని, రెండున్నరేళ్లుగా సంచార ల్యాబ్లను మూలన పడేశారని ఐపీఎం అధికారులు తెలిపారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదికలో ఏపీ 28వ స్థానానికి పడిపోయిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. మానవ వనరుల కొరత వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తక్షణమే స్పందించి కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.