విశాఖలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: పోలీస్ బాట
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరు మరియు నవంబర్ రెండో తేదీలలో విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు అయినట్లు విసాఖ నగర పోలీసు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి పోలీసు శాఖకు సహకరించాలని వారు కోరారు. ఎన్నికల నిబంధనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.