అంచనా కంటే వంద కోట్ల తక్కువకే ఎన్ హెచ్ 67 పెండింగ్ పనుల టెండర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనంతపురం

జాతీయ రహదారి 67 పెండింగ్ పనుల టెండర్లలో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అంచనా విలువ కంటే ఏకంగా రూ.102 కోట్ల తక్కువకే ఎస్ ఎస్ ఎన్ ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ బిడ్ దక్కించుకుంది. గుత్తి సమీపంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు, ఆర్ వో బి, రైల్వేలైన్ వద్ద బాక్స్ పుషింగ్స్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం వంటి పనులను ఈ సంస్థ దక్కించుకోవడం గుత్తేదారు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.