రామాయణం సినిమా సంగీతంపై సునీల్ లహరి అసంతృప్తి: నితేష్ తివారీ ప్రాజెక్ట్ పై వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం సినిమాలోని సంగీతం తన అంచనాలను అందుకోలేకపోయిందని రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ లో లక్ష్మణుడిగా నటించిన నటుడు సునీల్ లహరి తెలిపారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్నప్పటికీ, పాటల్ లోని కొన్ని శబ్దాలు తనను నిరాశపరిచాయని ఆయన పేర్కొన్నారు. అయితే సినిమాపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.