విజయవాడలో ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేసిన ఎన్‌ఐఏ

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

విజయవాడలో ఐసిస్ ఉగ్రవాదుల కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. అమాయక యువతకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన ఎన్‌ఐఏ, ఈ కేసుకు సంబంధించి విజయవాడ ప్రత్యేక కోర్టులో 9 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పేలుడు పదార్థాల తయారీ, ఆయుధ శిక్షణకు పక్కా ప్రణాళిక రచించిన ఈ ఉగ్ర కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.