ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య భద్రతపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ

రిపోర్టర్: శివ స్థలం: World

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆరోగ్య పరిస్థితిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రెగ్ చాపెల్ నేతృత్వంలో ఏడుగురు మాజీ కెప్టెన్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్‌కు సరైన వైద్య చికిత్స అందేలా పాక్ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఇది రాజకీయ అంశం కాదని, కేవలం మానవతా దృక్పథంతోనే స్పందిస్తున్నట్లు స్పష్టం చేశారు.