'పెను ప్రమాదం తప్పింది': కోదాడలో వినాయక మండపం వద్ద షార్ట్‌సర్క్యూట్
రిపోర్టర్: గోపి
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వినాయక మండపం వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపింది. విగ్రహ ఏర్పాటు ప్రాంతంలో లైటింగ్ వైర్లు కాలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే విద్యుత్ భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.