కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకై కుక్కునూరులో మొక్కలు నాటి నిరసన

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుక్కునూరు పీహెచ్సీ ఆవరణలో డాక్టర్ హర్షిత చేతుల మీదుగా మొక్కలు నాటి నిరసన తెలిపారు. సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు సున్నం శ్రీరాములు దొర మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.