వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రోజువారీ విచారణ చేపట్టాలి

రిపోర్టర్: రాము స్థలం: తూర్పు గోదావరి

కాకినాడ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానానికి హైకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 30 నాటికి విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ సంచలన కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు.