రైలు ప్రయాణికుడికి ఊహించని ఆరోగ్య సమస్య: స్పందించి వైద్యం అందించిన సిబ్బంది

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

రైలులో ప్రయాణిస్తున్న సమయంలో చెవిలో ఇయర్ బడ్ సిలికాన్ రబ్బరు ఇరుక్కుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికుడిని రైల్వే సిబ్బంది రక్షించారు. అర్ధరాత్రి వేళ ప్రయాణికుడు 139 హెల్ప్లైన్కు ఫోన్ చేసి సహాయం కోరగా, వెంటనే అప్రమత్తమైన అధికారులు జోలార్పేటలో వైద్యుడిని ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిలికాన్ రబ్బరును సులభంగా తొలగించారని, రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి తనకు సాయం చేశారని ప్రయాణికుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.