మచిలీపట్నంలో షిప్‌యార్డ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మచిలీపట్నం పోర్టులో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు 400 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.8 వేల కోట్ల పెట్టుబడితో నౌకల నిర్మాణ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.