ఢిల్లీ అల్లర్ల కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉమర్ ఖాలిద్, శర్జీల్
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
ద్విసభ్య ధర్మాసనం విచారణ నేపథ్యంలో రెండేళ్ల కాలంగా జైల్ లో మగ్గుతున్న ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతరులకు బెయిల్ లభించినందున తమకూ సమానంగా ఊరట కల్పించాలని వారు పిటిషన్ లో కోరినట్లు న్యాయవాదులు తెలిపారు. విచారణ ఆలస్యం కావడం వల్ల అండర్ ట్రయల్ ఖైదీలు ఎక్కువ కాలం కస్టడీలో ఉండటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు స్పష్టం చేశారు.