ప్రపంచాన్ని వణికిస్తున్న నీటి సంక్షోభంపై డబ్ల్యూఎంఓ తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
వాతావరణ మార్పుల కారణంగా భూమిపై నీటి వ్యవస్థ అత్యంత ప్రమాదకరంగా మారుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. గ్లేసియర్లు కరిగిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో వరదలు, కరవులు సంభవిస్తున్నాయని డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, మానవాళి మనుగడకు ఈ నీటి సంక్షోభం ముప్పుగా పరిణమిస్తోందని నివేదికలో స్పష్టం చేసింది.