చేవెళ్లలో ఆర్ అండ్ బీ డీఈ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: చేవెళ్ల
చేవెళ్ల రోడ్లు మరియు భవనాల శాఖ డివిజన్ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ బాట పట్టని అధికారి వైఖరి వల్ల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు మరియు ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో సరైన వసతి లేదంటూ ఆర్ అండ్ బీ డీఈ కె. అజయ్ కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.