ఎం పైపల్లె ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైకాపా శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండలం ఎం పైపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కె పద్మకు మద్దతుగా డాక్టర్ ఎం సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను కలుసుకుని పద్మను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.