మల్కన్‌గిరిలో దారుణం: ఇంట్లోకి చొరబడి దంపతుల హత్య, కుమారుడికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: మల్కన్‌గిరి
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా ఒర్కెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంవీ-36 గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడిన బిస్వంకర్ మండల్ అనే వ్యక్తి రవీంద్రనాథ్ సర్కార్, రేబా సర్కార్ దంపతులను కిరాతకంగా హతమార్చాడని ఒర్కెల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రెగన్ కిండో వెల్లడించారు. వారి అడ్డుకోబోయిన పదిహేనేళ్ల కుమారుడిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని, పరారవుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.