మెగా డీఎస్సీ ఉపాధ్యాయులపై దాడులు క్షమించరాని నేరమన్న పోతిరెడ్డి కృష్ణకాంత్
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ నేతలు మౌఖిక మరియు భౌతిక దాడులకు తెగబడడం క్షమించరాని తీవ్ర నేరమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ మండిపడ్డారు. ఉపాధ్యాయులపై జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.