మియామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: World
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్ కార్గో విమానం రన్వే దాటి రోడ్డుపైకి దూసుకెళ్లి వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.