మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గపోరు ఉద్రిక్తత: నివాసాల వద్ద భారీ పోలీసుల మోహరింపు
రిపోర్టర్: హరి
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరిందని, దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గాల మధ్య పండగ రోజుల్లో చెలరేగిన ఘర్షణలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రావు ఇంటితో పాటు దండేపల్లి మండలం తాళ్లపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, పలువురు స్థానిక నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.