నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై కలెక్టర్ దృష్టి సారించాలి
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి పైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడం, సిబ్బంది కొరత వేధించడం మరియు స్కానింగ్ యంత్రాలు తరచూ మొరాయించడం వంటి సమస్యలతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను వెంటనే పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.