రాజాపేట మల్లగూడెంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం మల్లగూడెం గ్రామంలో పసుపుల మమత అనే 28 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాజాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తఖియుద్దిన్ తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.