భారీ వర్షాలతో గేదెగడ్డ వాగు ఉధృతి ప్రయాణికులకు హెచ్చరిక
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గేదెగడ్డ వాగు భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తోంది. పాడేరు, ముంచంగిపుట్టు, లక్ష్మీపేట, గోమంగి వైపు ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు దాటే సాహసం చేయవద్దని హెచ్చరించారు.