వైఎస్ జగన్ పాలనలోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి: కాకాని గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గత వైఎస్ జగన్ పాలనలో రైతన్నలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు, యువతకు పరిశ్రమలు, ఉద్యోగాలు, విద్యార్థులకు ఆధునిక పాఠశాలలు, పేద ప్రజలకు మెరుగైన వైద్యం, ప్రజలకు చేరువగా జిల్లా పరిపాలన అందించామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. రెండు వేల పందొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రతి వర్గానికి అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి అందరి కళ్లముందే స్పష్టంగా కనిపించాయని, కానీ ప్రస్తుత పాలకులు ఆ వ్యవస్థలన్నింటినీ బలహీనపరుస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.