అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత: సైనిక దాడిపై ట్రంప్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దేశంపై సైనిక దాడి చేసేందుకు ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే పూర్తి స్థాయి సైనిక చర్యకు సిద్ధమవుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది.