ఆస్ట్రేలియా ఏ జట్టుపై ఘన విజయం సాధించిన భారత్

రిపోర్టర్: విజయ్ స్థలం: పుదుచ్చేరి

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఏ జాతీయ జట్టుతో జరిగిన తొలి నాలుగు రోజుల మ్యాచ్లో భారత్-ఏ జట్టు 162 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్పిన్నర్ షామ్స్ ములానీ ఏడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించగా, తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన కుమార్ కుశాగ్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కిందని నిర్వాహకులు తెలిపారు.