'మామ ఆంక్షలతో విసిగిపోయాను..': హత్యకు కుట్ర పన్నిన కోడలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాన్ಪುರ್

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఇంటి నిండా సీసీటీవీల నిఘాతో విపరీతమైన ఆంక్షలు పెట్టిన మామ వినీత్‌ మనోచా వైఖరికి విసిగిపోయిన కోడలు శాలు.. పనిమనిషి విశాల్‌తో కలిసి ఆయన్ని హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది. ఈ దారుణంలో వ్యాపారి కుమారుడు సుబ్రత్‌కు కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు హత్యకు ముందు వందలాది సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు.