ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం కోల్పోయానన్న అథ్లెట్ అనుష్ అగర్వాలా

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే తన కల చెదిరిపోయిందని ప్రముఖ ఈక్వెస్ట్రియన్ అథ్లెట్ అనుష్ అగర్వాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్, ఐఓఏ, క్రీడా మంత్రిత్వ శాఖ తన విజ్ఞప్తులను పట్టించుకోలేదని, ఇది ఓటమిలా కాకుండా ద్రోహంగా అనిపిస్తోందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టులు కూడా జోక్యం చేసుకోకపోవడంతో ఆయన ఆసియా క్రీడల రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నారు.