విదేశీ వైద్య విద్యార్థుల స్టైపెండ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

విదేశీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించని వ్యవహారంపై నేషనల్ మెడికల్ కమిషన్ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజస్థాన్ ప్రభుత్వానికి రెండు వారాల్లోగా పెండింగ్ స్టైపెండ్ విడుదల చేయాలని స్పష్టం చేస్తూ, లేనిపక్షంలో రాష్ట్ర కార్యదర్శిని కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది.