పంటల రక్షణకై ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించాలని డిమాండ్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ రైతన్నలకు 24 గంటల కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి ఆదుకోవాలని కోరారు. విద్యుత్ కోతల వల్ల పాడి రైతులు, వ్యవసాయ సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ల పేరుతో డబ్బులు వసూలు చేయవద్దని అధికారులను హెచ్చరించారు.