ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ కత్తిపోట్ల దాడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Dubai
దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ తీవ్ర దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓమాన్ దేశానికి చెందిన కోపైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పై కత్తితో దాడి చేశాడని, ఈ ప్రమాదకర పరిస్థితుల్లోనూ తీవ్ర గాయాలతో కెప్టెన్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా దించారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ సాహస ప్రయాణంలో ప్రాణాలను కాపాడిన సిబ్బందిని ఆయన అభినందించారు.