ఐపీఎల్ ట్రేడింగ్ లో సంచలనం: హార్దిక్ పాండ్యా కోసం ముంబై, పంజాబ్ చర్చలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Mumbai
ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో భాగంగా హార్దిక్ పాండ్యా మరియు అర్షదీప్ సింగ్ ల మధ్య భారీ మార్పిడికి సంబంధించి ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ముమ్మర చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆక్షన్ కు ముందు ఈ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు కూడా హార్దిక్ పై ఆసక్తి చూపుతున్నాయని, అయితే తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉందని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.