పట్టణ మౌలిక వసతులకు పదకొండు వేల కోట్ల నిధులు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. ఇరవై ఆరు జిల్లాల్లోని నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.11,360 కోట్ల భారీ మూలధన పెట్టుబడిని ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిధులతో రోడ్లు, ఉద్యానవనాలు, వీధి దీపాలు వంటి కీలక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్రంలోని నగరాలను సురక్షితంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు.