చీపురుపల్లిలో మహాకవి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శోధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వర రావు ఆధ్వర్యంలో రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన మహాకవి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గురజాడ మనవడు ప్రసాదరావు, రచయిత గంట్యాడ గౌరీనాయుడు, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ఎస్.సన్యాసిరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.