హైదరాబాద్‌లో ఘనంగా రాజ్ తరుణ్ 'టార్టాయిస్' చిత్ర పాట విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న 'టార్టాయిస్' చిత్రంలోని 'నీ పరిచయం' పాటను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అద్భుతంగా కుదిరాయని పేర్కొన్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.