మార్లగుంటలో వీధికుక్కల స్వైరవిహారంతో విద్యార్థికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలం మార్లగుంట గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్రమైంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇటీవల ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. నేడు ఒకటో తరగతి విద్యార్థి వెంకట మహేంద్రపై కుక్క దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి వీధికుక్కల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.