వీధి వ్యాపారుల వస్తువుల జప్తుపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
వీధి వ్యాపారుల వస్తువులను జప్తు చేసిన 24 గంటల్లోపు సీజర్ మెమో ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఎంసీడీ, ఎన్డీఎంసీలను ఆదేశించింది. పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యల్లో పారదర్శకత ఉండాలని కోర్టు పేర్కొంది. జప్తు చేసిన వస్తువుల జాబితా, జరిమానా వివరాలు మెమోలో ఉండాలని తెలిపింది.